నూతన మున్సిపాలిటిలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందను నూతన మున్సిపాలిటీ గా ప్రకటించడం జరిగింది. దీనిపై గత మార్చి నెలలో గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించేందుకు గాను జిల్లా అడిషనల్ కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ లు గ్రామాన్ని సందర్శించినప్పుడు తమ గ్రామాన్ని గ్రామపంచాయతీ గానే ఉంచాలంటూ గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వ తీరు మారకపోవడంతో మంగళవారం గ్రామస్థులు బిచ్కుంద మున్సిపల్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.