తనకాలన్ గ్రామంలో సాయంత్రం 6 దాటితే చాలు దోమలు విపరీతంగా ఇంట్లోకి చొరబడి నరకం చూపిస్తున్నాయి. ఈ దోమల వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నారులు నుండి వృద్ధుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులలో స్పందన కరువైందని, ఇకనైనా అధికారులు స్పందించి దోమల నివారణకు మందును స్ప్రే చేయగలరని గ్రామ ప్రజలు మంగళవారం కోరుతున్నారు.