ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ లో చైన్స్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఓ మహిళ వీధి రోడ్డుపై వెళ్తుండగా.. బ్లూ కలర్ స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ ఘటన రికార్డ్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.