చేపూర్ విడిసి సభ్యులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

69చూసినవారు
చేపూర్ విడిసి సభ్యులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత
ఆర్మూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో చేపూర్ వీడిసి సభ్యులు తాసిల్దార్ గజానంద్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చేపూర్ వీడిసి కు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశాడని తెలిపారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని గ్రామానికి చెందిన భూమిని వీడిసి కమిటీకి అప్పగించే విధంగా అధికారులు సర్వేలు చేపట్టి అక్రమానికి గురైన భూమిని వీడీసీకి అప్పగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్