ఆలూర్ మండల కేంద్రంలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని కరెంట్ సిబ్బంది గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 33/11KV సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్తు మరమ్మతులు చేయడం వలన ఆలూర్ లో కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.