పదవ తరగతి విద్యార్థులు మంచిగా చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని DCEB కార్యదర్శి సీతయ్య అన్నారు. శనివారం సాయంత్రం గుడారం ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి GPA సాధిస్తే ఐఐఐటీ వంటి సంస్థల్లో సీట్లు వస్తాయని తద్వారా మంచి ఉద్యోగాలు పొందవచ్చునని సూచించారు.