ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ సావిత్రి ఆధ్వర్యంలో మంగళవారం అమ్మ మాట.. అంగన్వాడీ బడిబాటకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మ మాట.. అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను అంగన్వాడి చేర్పించడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.