ఆర్మూర్ పట్టణంలో జులాయిగా తిరుగుతూ రాత్రివేళల్లో బండిపై న్యూసెన్స్ చేస్తున్న ఆర్మూర్ లోని గోల్ బంగ్లా ఔట్గల్లీకి చెందిన అబ్దుల్ అన్సర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ వో సత్యనారాయణ తెలిపారు. ఆర్మూర్ కోర్ట్ లో హజరపరచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ 8 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.