

పాక్ దుశ్చర్య.. జమ్మూలో విధ్వంసం (వీడియో)
జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో శనివారం పాక్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల మాత్రం విధ్వంసం జరుగుతోంది. పాక్ చేసిన దాడికి రెహరీ ప్రాంతంలో కార్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజామున తమ భవనంపై పెద్ద వస్తువులాంటిది పడిందని, బయటకు వచ్చి చూస్తే మొత్తం పొగ కమ్మేసి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు.