తెలంగాణ యూనివర్సిటీ నూతన వీసీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ టీ. యాదగిరిరావును నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు మర్యా దపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు వీసీని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.