జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, క్యాషియర్ నరేష్ మాట్లాడుతూ భక్తులకు హనుమాన్ జయంతి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.