కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియామాకమైన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పాత శివకృష్ణ మూర్తి, పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.