ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ చిన్నయ్య సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సావిత్రి బాయి పూలే మహిళా విద్యా వ్యాప్తికి, జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేశం, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.