నిజామాబాద్: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

84చూసినవారు
నిజామాబాద్: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి
నిజామాబాద్ జిల్లా నందిపేట మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్