మానవత్వంతో చేసిన అనేక సేవల్ని గుర్తించి ప్రతిష్టాత్మక అమెరికా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందజేసిన సందర్భంగా మంగళవారం దుబ్బ కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ పడకంటి రామును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, విద్యుత్ శాఖ లైన్ మెన్ ప్రవీణ్ చారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీరామ సతీష్ కుమార్ చారి, ఫైర్ డిపార్ట్ మెంట్ హెడ్ కానిస్టేబుల్ కత్రాజి సుమన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.