సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్ పట్టణంలో ఆయన వర్ధంతి సందర్బంగా పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, జిల్లా బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.