సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి (ఫిబ్రవరి 15)ను ప్రభుత్వ సాధారణ సెలవు దినంగా గుర్తించాలని సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ లాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ గిరిజన ప్రజలలో ఉందని తెలిపారు. ఇకనైనా సాధారణ సెలవు దినంగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేముల శేఖర్, మురళి పాల్గొన్నారు.