ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పట్టుబడినవారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోర్టు ఎదుట హాజరుపరిచారు. మామిడిపల్లికి చెందిన దేరంగుల ఎర్రన్నకు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్టు ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ పేర్కొన్నారని ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ తెలిపారు.