జాతీయ లోక్ ఆదాలత్ లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యలను ఇరువురు రాజీ చేసుకున్నారని ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. జడ్డి మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారానే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఏడాదికి నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని తెలిపారు.