నందిపేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

72చూసినవారు
నందిపేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
నందిపేట్ లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. యువకులు వీధి వీధినా మువ్వన్నెల జెండాలు ఎగురవేశారు. పలు స్కూళ్లలోని పిల్లలు వివిధ వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. నందిగుడి, వివేకానంద చౌరస్తా చాకలి, ఐలమ్మ చౌరస్తా, పోచమ్మ గల్లి, హనుమాన్ గల్లి లతో పాటు వివిధ పార్టీ నాయకులు వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలని ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్