ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట

52చూసినవారు
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో ఆయనకు జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ముందస్తు బెయిల్ ను బుధవారం మంజూరు చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు జీవన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

సంబంధిత పోస్ట్