ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గత అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో శనివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి, రూ. 50 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.