
ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం: మంత్రి గొట్టిపాటి
AP: తల్లులకు చేకూర్చే లబ్ధి చూసి ఓర్వలేక వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తల్లికి వందనం కింద విద్యార్థులకు రూ.10 వేల కోట్లు లబ్ధి ఒక రికార్డు అని కొనియాడారు. పాఠశాలలు తెరిచిన రోజే పుస్తకాలు, నాణ్యమైన విద్యా కిట్లు పంపిణీ చేస్తామన్నారు. నిన్నటి వరకు వైసీపీ సైకోలు మహిళలను కించపరుస్తూ మాట్లాడారని, ఇప్పుడు తల్లుల ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.