చేపూర్ లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

59చూసినవారు
ఆర్మూర్ మండలం చేపూర్ శివారులో జాతీయ రహదారి 63పై బుధవారం ఉదయం 11 గంటలకు చోటు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చేందారు. ఆర్మూర్ కు చెందిన అర్జున్, నరేందర్ బైక్ పై మెట్ పల్లి వైపు నుంచి ఆర్మూర్ వస్తుండగా చేపూర్ శివారులో కరీంనగర్ వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొనడంతో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందారు. నరేందర్ ఆర్మూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో హైవే ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్