
దర్శకుడిగా మారనున్న రాహుల్ రామకృష్ణ
టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మారనున్నారు. ‘ దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్, ఫొటోలను నా మెయిల్‌కు పంపించగలరు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో రాహుల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, జాతిరత్నాలు వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.