కొత్తపల్లి MPPS ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు సుజాతని ప్రధానోపాధ్యాయులు రఘు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయుడు పాక్పట్ల సాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.