ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలను చెప్పే గలాలను నిరంకుశంగా అనగ దోక్కుతున్నారు. సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ను టిడిపి ప్రభుత్వం అరెస్టు చేయడం అమానుషం, జర్నలిస్టులను అరెస్టు చేసి ఆరాచకానికి పాల్పడుతుందని ఎన్ యు ఐజే జాతీయ ఉపాధ్యక్షులు రాజేంద్రనాథ్ అన్నారు. జర్నలిస్టుల పై దాడులను నిరసనగా కామారెడ్డి జిల్లా జర్నలిస్టు నాయకులు నిరసన తెలిపారు.