వేల్పూర్ మండల కేంద్రంలో బ్లూమింగ్ బడ్స్ స్కూల్ లో ఇటీవల జరిగిన పాఠశాల వార్షికోత్సవానికి ఇతర కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోయినందున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు పాఠశాల కు వెళ్లి యాజమాన్యానికి, విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.