బాల్కొండ మండల కేంద్రంకు చెందిన తెడ్డు ముత్యం కంటి క్యాన్సర్స్ లోకి చికిత్స అవసరమై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేరడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారి చికిత్స కొరకు లక్ష పదివేల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఆదివారం హైదరాబాదులో ఎమ్మెల్యే నివాసంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారి చికిత్స కోసం ఎల్ఓసి అందించిన వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.