వేల్పూర్ మండలం కేంద్రంలో మంగళవారం గోన్ గొప్పుల గ్రామానికి చెందిన గోపరి ఓడ్డన్న అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చేరడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా చికిత్స కొరకు రూ. 1,10,000 ఎల్ఓసీ మంజూరు చేయించారు. వేల్పూర్ లోని నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం ఎల్ఓసీ కాపీ ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.