గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వారి సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని యూఏఈ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి అన్నారు. దుబాయి లోని శ్రీ హోటల్ వద్ద మంగళవారం రాత్రి తెలంగాణ ప్రవాసీయులు అనిల్ కు ఆత్మీయ వీడ్కోలు పలికిన సందర్బంగా ఆయన కార్మికులతో ముచ్చటించారు.