శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ శాసనసభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందన్నారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఎన్నడూ ఇలా జరగలేదు. సభలో బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా పడింది. క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసనసభను వాయిదా వేస్తారా.. ఒక్క నిమిషంలోనే సభను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.