ఏర్గట్లలో విద్యుత్ ఘాతంతో గేదె మృతి

64చూసినవారు
ఏర్గట్లలో విద్యుత్ ఘాతంతో గేదె మృతి
ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో శనివారం పొలంలో తెగిపోయిన విద్యుత్ తీగను తాకడంతో అక్కడికక్కడే గేదె మృతి చెందింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని బాధిత రైతు మునిమాణిక్యం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గేదె మృతితో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. గేదె విలువ సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు తగిన నష్టపరిహారం అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్