కమ్మర్ పల్లి మండలంలోని రాజరాజేశ్వర నగర్ గ్రామానికి చెందిన సరిగెల సాయికి రూ. 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ద్వారా మంజూరు అయినందుకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.