ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామంలో శనివారం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో మృతిచెందిన గాండ్ల రమేష్ కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. మేర లింబాద్రిని, సోమ గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.