మెండోరా స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా జిల్లా కమిషనర్ అఫ్ పోలీస్ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెల్ఫేర్, రికార్డ్స్ పరిశీలించారు. మెండోరా మండల పరిధిలో గల పలు గ్రామాల క్రైమ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి వుండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చే విధంగా పోలీసులు క్రమశిక్షణతో ఉండాలన్నారు.