తెలంగాణ రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఇంటర్నెట్ సెంటర్ వైపు పరుగులు తీస్తున్నారు. బదిలీలకు 24 గంటలు టైం ఇవ్వడంతో సీనియారిటీ జాబితాలో చివర ఉన్న ఉపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అన్ని ఆప్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. కావున సమయం సరిపోవడం లేదు. ఇంకా సమయం పొడగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు