కమ్మర్ పల్లి మండల కిషన్ మోర్చా అధ్యక్షులుగా కుంట రమేష్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా చిట్యాల దేవేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లికార్జున్ రెడ్డిలు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతగా పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.