కమ్మర్ పల్లి: ఫర్టిలైజర్ షాపుని ముట్టడించిన రైతులు

7చూసినవారు
కమ్మర్ పల్లి: ఫర్టిలైజర్ షాపుని ముట్టడించిన రైతులు
కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ ద్వారా నకిలీ గడ్డి మందులు వాడినందున సోయా పంట నష్టపోయిందని రైతులు శనివారం ఫర్టిలైజర్ షాపు వద్ద ధర్నా చేశారు. ఉప్లూర్, కమ్మర్ పల్లి, చౌట్పల్లి, హస కొత్తూర్, తదితర గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా నిర్వహించారు. రైతులు సంబంధిత అధికారులకు తెలిపిన స్పందించలేదని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్