ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలనే ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు కమ్మర్ పల్లి ఎస్సై జి. అని రెడ్డి తెలిపారు. మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులు అందించే సేవలను ప్రజలకు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారాన్ని తమకు అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.