పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో గురువారం మండలంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉచిత పార్టీ పుస్తకాలు నోట్ బుక్ లు యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని హస కొత్తూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పాఠశాలలో చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.