కమ్మర్ పల్లి: ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ స్థలం ఏర్పాటు

53చూసినవారు
కమ్మర్ పల్లి: ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ స్థలం ఏర్పాటు
కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించేందుకు శుక్రవారం స్థలాన్ని శుభ్రపరచినట్లు ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. పాఠశాలలో ఆట స్థలం, శిథిలావస్థకు చేరిన టాయిలెట్లు తొలగించి క్లీన్ చేసినట్లు తెలిపారు. ఆ స్థలం క్లీన్ చేయడానికి సహాయపడ్డ చిన్నోళ్ల అరుణ్ రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్