కమ్మర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలో గ్రామ గ్రామాన బీజేపీ కార్యకర్తలతో జూన్ 5వ తేదీ వరకు మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న యువ మోర్చ్ బీసీ, ఎస్సీ, ఓబీసీ నూతన కమిటీల ఏర్పాటు గురించి చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గం పాల్గొన్నారు.