వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ బుధవారం పరిశీలించారు. చౌటుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు అందుతున్న వ్యాఖ్యలను పరిశీలించారు. తప్పకుండా పిల్లలకు షెడ్యూల్ వారీగా వాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ తరుణ్, వైద్యాధికారి స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.