రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

75చూసినవారు
రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ జ్యుడీషియల్ కమిషన్ ఎదుట ఇరిగేషన్ అధికారులు, మాజీ అధికారులు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు రేపు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బూర్జుల రామకృష్ణారావు భవన్ లో జరగనున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు బుధవారం కేసీఆర్ హాజరు కానున్నారని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్