భారతీయ జనతా జనతా యువ మోర్చా కమ్మర్ పల్లి మండల అధ్యక్షులుగా కొత్తపల్లి గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గణేష్ మాట్లాడుతూ హిందూ ధర్మం, దేశ రక్షణ, రైతుల, నిరుద్యోగుల కోసం, నిరు పేద, బడుగు బలహీన ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు.