కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మంగళవారం వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్, సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, నాయకులు పాల్గొన్నారు.