ఈనెల 27న వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం బాల్కొండ నియోజకవర్గ కమ్మర్పల్లి మండలంలో కాసేపు ఆగి స్వయంగా బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాల్ రైటింగ్ రాశారు. బాల్కొండ నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్తామని ప్రజలు స్వచ్ఛందంగా తలలి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి అన్నారు.