కమ్మర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పూలే ఒక సామాజిక విప్లవమని, బహుజనుల విద్య, ఉపాధి, రిజర్వేషన్లకై పోరాడిన యోధుడని, స్త్రీ విద్యకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాలెపు నర్సయ్య, కన్వీనర్ నిమ్మ రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.