కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం వనభోజనాలకు వెళ్లారు. రంగయ్య గుట్ట వద్ద గ్రామ దేవతలకు పూజలు చేసి మేకలను బలిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వనాల్లో కెళ్లి భోజనాలు చేశారు. వన భోజనాలంటే పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఎంతో సంబరం. పిల్లలు నృత్యాలు చేస్తూ ఆటలాడుతు సందడి చేశారు.